దర్బార్ రజనీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలంటే ఫ్యాన్స్‌కు పండగ. ఈమధ్య తెలుగులో కాస్త జోరుతగ్గినా తమిళంలో రజనీ సినిమాలు మళ్లీ పుంజుకున్నాయి. రజనీ లాస్ట్ సినిమా ‘పేట’ మంచి కలెక్షన్స్ వసూలు చేసి, ఆయన ఇమేజ్‌కు వచ్చిన ఇబ్బందేమీ లేదని రుజువుచేసింది. ఇక సూపర్‌స్టార్ తన కొత్త సినిమా దర్బార్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌నూ విడుదల చేశారు. అయితే రజనీ వీరాభిమాని ఒకరు దర్బార్ పోస్టర్‌ను డిజైన్ చేయగా, అది సోషల్ మీడియాలో వైరలైంది. అసలు పోస్టర్‌కంటే వెయ్యి రెట్లు బెటర్‌గా ఈ పోస్టర్ ఉందంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇక ఈ పోస్టర్‌లో రజనీ స్టయిల్, ఆటిట్యూడ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పోలీస్ యూనిఫాంలోవున్న రజనీ స్టైల్‌గా చేత్తో కూలింగ్ గ్లాసెస్ ధరించే పోజ్ ఇది. ఈ ఫోటోచూసి తలైవర్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.