టీజర్‌లో ఏకమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కృతి ప్రొడక్షన్స్ మరియు ఆనంద థాట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘ఏకమ్’. వరుణ్ వంశీ దర్శకుడిగా పరిచయం అవుతుంటే, కళ్యాణ్‌శాస్ర్తీ, పూజ, శ్రీరామ్‌లు సినిమాను నిర్మిస్తున్నారు. శివుడి మూల కథాంశంతో తెరకెక్కించిన చిత్రం టీజర్‌ను ‘మా’ అధ్యక్షుడు నరేష్, బ్యానర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి, అనిల్ సుంకర విడుదల చేశారు. నరేష్ మాట్లాడుతూ డిఫరెంట్ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయి. ‘ఏకమ్’ కొత్తగా అనిపిస్తోంది. అన్ని జెనరేషన్స్‌కు కనెక్టయ్యేలా ఉందన్నారు. హీరో అభిరామ్‌వర్మ మాట్లాడుతూ న్యూ జోనర్, క్లాసికల్ చిత్రంగా తెరకెక్కుతోందని, వరుణ్ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. డైరెక్టర్ వరుణ్ వంశీ మాట్లాడుతూ నిర్మాత కళ్యాణ్ చాలాకాలంగా తెలుసని, డైరెక్టర్ అవ్వాలని అనుకుంటున్నట్టు చెప్పి కథ చెప్పగానే మనమే చేద్దామంటూ ముందుకొచ్చారన్నారు. ఇండస్ట్రీకి వచ్చాకే స్టార్ కావాలంటే ఎంత కష్టమో అర్థమైందన్నారు. ఏకమ్ సినిమా న్యూజోనర్ అంటూ, పంచభూతాల ఆధారంగా కథ ఉంటుందన్నారు. నిర్మాత కళ్యాణ్‌శాస్ర్తీ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచీ వరుణ్ కథలు బాగా చెప్పేవాడని, అతనిమీద నమ్మకంతోనే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చానన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫిలాసఫికల్ ఫిక్షన్‌గా ఏకమ్ రాబోతోందన్నారు. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం ఉందన్నారు.