దర్శకత్వం నా లక్ష్యం ..రాజ్‌తరుణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హ్యాట్రిక్ హిట్‌తో జోరుమీదున్నాడు యువ హీరో రాజ్‌తరుణ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఈడోరకం ఆడోరకం’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హీరో రాజ్‌తరుణ్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..
‘ఇది పంజాబీ సినిమా స్ఫూర్తితో తీసిన సినిమా. కథ చెప్పగానే బాగా నచ్చింది. ప్రతీ ఫ్రేమ్ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ తనకెదురైన పరిస్థితులనుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెబుతూ ఇతరులను ఇరికిస్తూ వుంటారు. అందులో అందరినీ కన్‌ఫ్యూజ్ చేస్తూ తమ పబ్బం గడుపుకునే ఆ ఇద్దరిలో నేను అశ్విన్ అనే పాత్రలో నటిస్తున్నాను. విష్ణుతో పనిచేయడం చాలా ఆనందంగా వుంది. మా ఇద్దరి కాంబినేషన్ థియేటర్లలో ప్రేక్షకులను నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా హెబాపటేల్‌ను నిర్మాతలే సెట్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్‌గారితో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి.
ఆయన ఎనర్జీ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఆయనకున్న ఎనర్జీలో మనకు పదిశాతం వుంటే చాలు, ఖచ్చితంగా ఈ సినిమా మంచి హిట్ అవుతుందన్న నమ్మకం వుంది. నాగేశ్వర్‌రెడ్డి అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా తరువాత మారుతి బ్యానర్‌లో ఓ సినిమా, దిల్‌రాజు బ్యానర్‌లో మరో సినిమా ఉంటుంది. అలాగే గీతా ఆర్ట్స్‌లో కూడా ఓ సినిమా చేయాలి. వీటితోపాటు నేనో కథ రెడీ చేస్తున్నాను. అది నాకోసం కాదు. ఖచ్చితంగా దర్శకత్వం చేసే ఆలోచనలైతే ఉన్నాయి’ అని ముగించాడు.