మళ్లీ వస్తోంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొత్తబంగారులోకం’ చిత్రంతో తెరంగేట్రం చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శే్వతాబసు ప్రసాద్ గుర్తుంది కదా! మంచి అందంతోపాటు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత సరైన సినిమాలు లేక కొన్ని చిక్కుల్లో ఇరుక్కుని తెరమరుగైపోయింది. ఆమె కష్టాల్లో వున్నపుడు టాలీవుడ్‌లో కొందరు హీరోలు ఆమెను ఆదుకుంటామని, సినిమాలు లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్న ఆమెకు సినిమా అవకాశాలు ఇస్తామని భారీగా ప్రకటనలిచ్చారు. కానీ కట్ చేస్తే ఒక్కరైనా సరే ఆమెను ఆదుకోకపోగా చిన్న పాత్రలు కూడా ఇవ్వలేదు. దీంతో పెట్టేబేడా సర్దుకొని ముంబాయి వెళ్లిపోయిన ఈమె టీవీ కార్యక్రమాల్లో డాన్సు ప్రోగ్రాములు, డాక్యుమెంటరీలు చేసుకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తోంది. అక్కడ కూడా అవకాశాలు రాకపోయినా ఒక్కసారిగా ఆమెకు ఓ అదృష్టం తలుపు తట్టింది. బాలీవుడ్‌లో పెద్ద దర్శకుడిగా పేరున్న కరణ్‌జోహార్ రూపొందించబోయే తరువాతి చిత్రంలో ఆమెను మంచి పాత్రకు ఎంపిక చేశారు. అసలే సినిమాలు లేక వున్న శే్వత ఈ ఛాన్సును ఎగిరి గంతేసి అందుకుంది. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలుస్తాయి. సినిమాలే లేని సమయంలో ఓ మంచి ఛాన్సు ఇచ్చిన కరణ్ జోహార్‌ను అందరూ అభినందిస్తున్నారు. ఈ సినిమాతో అయినా శే్వత కెరీర్ ఊపందుకుంటే అదే సంతోషం!

చిత్రం శే్వతాబసు