తెనాలి రామకృష్ణ ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్ కిషన్ హీరోగా నాగేశ్వర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం -తెనాలి రామకృష్ణ, బిఏబీఎల్. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉప శీర్షిక. నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీశ్‌లు తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా చిత్రబృందం హీరో ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. లాయర్‌గా తన ఆఫీస్ చాంబర్‌లో రిలాక్స్‌డ్‌గా కాళ్లు టేబుల్‌పై పెట్టుకుని చేతులెత్తి దండం పెడుతున్న సందీప్ లుక్ ఫన్నీగా ఉంది. ‘టిఆర్‌కె’ ప్రాజెక్టులో సందీప్‌కు జోడీగా హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ కనిపించనున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాలను తెరకెక్కించటంలో మంచి పేరున్న నాగేశ్వర రెడ్డి ఈ సినిమానూ తనదైన స్టైల్లో లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. చిత్రంలో మురళీశర్మ, వెనె్నల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.