శివలింగాపురంలో ఏంజరిగింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో కొక్కొరొకో, మా తల్లి గంగమ్మ, లిటిల్ హార్ట్స్ వంటి చిత్రాలను నిర్మించిన రావూరి వెంకటస్వామి తాజా ప్రయత్నంగా అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి అల్లికేశ్వరి సమర్పణలో శివలింగాపురం పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ, మలయాళ సినీ రంగాల్లో యాక్షన్ హీరోగా ఇమేజ్ ఉన్న ఆర్.కె.సురేష్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తూ తెలుగు తెరకు తొలిసారి పరిచయవౌతున్నారు. అతని సరసన మధుబాల కథానాయికగా నటిస్తోంది. తోట కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకున్న చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ విషయాన్ని నిర్మాత రావూరి వెంకటస్వామి తెలియజేస్తూ కథ విని స్పందించి చిత్రాన్ని నిర్మిస్తున్నాను. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35 రోజులపాటు జరిపిన షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తయింది. మరోవైపు డబ్బింగ్ పనులుకూడా పూర్తిచేసుకుని ప్రస్తుతం రీరికార్డింగ్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. మేం అనుకున్నట్లుగానే చిత్రం బాగా వచ్చింది. జూన్ నెలలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలతో చిత్ర కథ సాగుతుంది. ప్రేమ, సెంటిమెంట్, యాక్షన్, డివోషనల్ అంశాల సమ్మేళనంతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. శివుడిగా డాక్టర్ భూమారెడ్డి, పార్వతిగా మేఘనా శ్రీలక్ష్మి నటించారు. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం నృత్యం చిత్రంలో ఓ ఆకర్షణగా నిలుస్తుంది అని అన్నారు. ఇతర పాత్రల్లో ప్రియాపృథ్వి, ప్రదీప్, బత్తినేని శ్రీను, వెడదల శివ నటిస్తున్నారు.