తిరుగులేని మహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేష్‌బాబు 25వ చిత్రం -మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకుడు. అశ్వినీదత్, దిల్‌రాజు, పీవీపీలు నిర్మాతలు. సినిమా గురువారం విడుదలవుతున్న సందర్భంగా దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు.
మహేష్ కెరీర్‌లో లాండ్‌మార్క్ చిత్రమిది. సిల్వర్ జూబ్లీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్టు మహేష్ కెరీర్‌లో కొన్ని టాప్ సినిమాలున్నాయి. మహర్షి ఆ కోవలోకే వస్తుంది. కథ విన్నప్పుడే గ్రేట్ అనిపించింది. సినిమా పూర్తిగా చూశాక, ఆ నమ్మకం మరింత బలపడి చెప్పాను. కొన్ని సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయవు. ఓ స్టార్ హీరో సినిమాకు కావాల్సిన గ్రేట్ మూమెంట్స్ ఇందులోవున్నాయి.
అశ్వినీదత్ ఈ సినిమాతో అసోసియేట్ అయి ఉన్నారు. మే 9న ఆయన సంస్థలో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘మహానటి’ విడుదలయ్యాయి. ఆయనకు ఆ డేట్‌కు ఓ మ్యాజిక్. అలాగే పీవీపీ కూడా ప్యాషన్‌తో ఈ సినిమాతో అసోసియేట్ అయ్యారు. మహేష్ 25వ చిత్రానికి మూడు బ్యానర్లు అసోసియేట్ కావడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్.
వంశీ ఈ సినిమాతో గొప్ప దర్శకుల జాబితాలోకి చేరిపోతాడు. దేవీ సంగీతం, మోహనన్ కెమెరా, కథను రాసుకోవడంలో వంశీతో ట్రావెలైన హరి, సాల్మన్, ఎడిటర్లు, ఆర్టిస్టులు అంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మ్యాజిక్ క్రియేట్ చేసే సినిమా ఇది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. జస్ట్ నమ్మకం అంతే.
ఈ సినిమా మంచి ఫలితాన్ని తెస్తుందని -పది సినిమాలను నమ్మితే అందులో ఓ ఒక్కటో మిస్సవ్వొచ్చు. మిగిలిన తొమ్మిదీ మాత్రం మిస్ కావు. అది నా ఎక్స్‌పీరియన్స్. మహర్షి సినిమా కచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది.
సినిమాకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఐదో షో కోసం అడిగాం. ప్రభుత్వం అంగీకరించి అనుమతిచ్చింది. నిన్న తెలంగాణలో జీవో వచ్చాక మిస్ కమ్యూనికేషన్ జరిగింది. మరీ ముఖ్యంగా అడ్మిషన్ రేట్లగురించి. ఈ అడ్మిషన్ రేట్లు అనేవి తెలంగాణ ప్రభుత్వం కాకుండా, థియేటర్ల ఓనర్లే కోర్టుద్వారా సాధించుకున్నారు. పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్ చిత్రాలు వచ్చినపుడు సినిమా రెవెన్యూ జనరేట్ చేయడానికివున్న స్కోప్‌లో ఎగ్జిబిటర్స్ ద్వారా ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. ఈ హైక్ ఒకవారం మాత్రం ఉంటుంది.
ఒకప్పుడు సక్సెస్ ఫుల్ సినిమా జర్నీకి జూబ్లీ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత అవి 100 రోజులయ్యాయి. ఇపుడు బాహుబలి లాంటి సినిమాకు కూడా 50 రోజులే అవుతున్నాయి. అందువల్ల ఒక గ్రేట్ సినిమా వచ్చినా రెవెన్యూ అనేది మేజర్‌గా తొలి నాలుగు రోజులే ఉంటుంది. హాలీవుడ్, బాలీవుడ్‌గానీ, మన దగ్గర కానీ, ఎక్కడైనా ట్రెండ్ మారింది. ఆ వీకెండ్స్‌వున్న రెవెన్యూ మెయిన్‌గా సాగుతోంది. ఇపుడు అందరూ ఫాస్ట్ఫుడ్ డేస్‌లో ఉంటున్నారు. సినిమాను ఫాస్ట్‌గా చూడాలనేది ఒకటి, రెండోది పైరసీవల్ల డామేజ్ ఎక్కువగా జరుగుతోంది. ఎంత కంట్రోల్ చేసినా, ఏంచేసినా పైరసీ వస్తూనే వుంది. అలాంటప్పుడు పెద్ద సినిమాలలు టార్గెట్ రీచ్ కావాలంటే టికెట్ ధరల పెంపు తప్పదు.
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతికి సినిమాలు విడుదలైనపుడు రేట్లను పెంచుకోవచ్చు. కానీ తెలంగాణలో అది ఇదివరకు లేదు. పక్క రాష్ట్రాల వారితో కంపేర్ చేసినపుడు ఇక్కడ అట్లీస్ట్ పెరగాలి కదా అని థియేటర్లవాళ్లు వెళ్లి తెచ్చుకున్నారు. ఇది ఇండివిడ్యుయల్‌గా తెచ్చుకున్నదే. నేను పెట్టింది నాకు వచ్చింది. ఇలాంటి ఫ్యాక్ట్స్ ఎవరికి తెలుసు? తెలుసుకోకుండా ఏదేదో రాసేయడం వల్ల చాలా డామేజ్ జరిగే ప్రమాదం ఉంటుంది. నిజానిజాలను గ్రహించాలని విజ్ఞప్తి చేస్తున్నా.