మహా సేతు-పతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాషాభేధం లేకుండా విలక్షణ నటనతో అభిమానులను సంపాదించుకున్న విజయ్ సేతుపతికి మాడరన్ కమల్‌హాసన్ అన్న పేరు ఎప్పుడో వచ్చేసింది. తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నా, మార్కెట్‌లేని కారణంగా ఇప్పటి వరకూ తెలుగు ప్రేక్షకులకు అపరిచితుడుగానే ఉండిపోయాడు. మెగాస్టార్ 152వ సినిమా సైరాలో ఓబయ్య పాత్రకు ఓకే చెప్పడంతో ఇప్పుడు ఆ పరిస్థితినీ దాటేసి -మరో ప్రాజెక్టులో విలన్‌గానూ ఎంటరైపోతున్నాడు. మెగా కాంపౌండ్‌నుంచి వస్తున్న వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ ప్రాజెక్టులో విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషిస్తుండటం తెలిసిందే. ఇదిలావుంటే -సేతుపతి సినిమా అంటే ఓకే చెప్పాలా వద్దా అనుకున్న హీరోయన్లు, ఇప్పుడు ఇతని సినిమా అంటే ఎగిరి గంతేస్తున్నారు. ఇటీవలే శృతిహాసన్ జోడీగా విజయ్ సేతుపతి కొత్త చిత్రం మొదలవ్వడం తెలిసిందే. చాలాకాలంగా సినిమాలకు దూరంగావుంటున్న శృతి -విజయ్ సేతుపతి సినిమా అనగానే ఓకే చెప్పేసింది. దీనికిముందే మరో ప్రాజెక్టులో విజయ్ సేతుపతితో జోడీ కట్టేందుకు రాశీ ఖన్నా ఓకే చెప్పింది. విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగ తమిజన్‌లో విజయ్ సేతుపతి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా సగం పూరె్తైంది. ఓ పాత్రకు రాశి ఖన్నా జోడీగా నటిస్తుంటే, మరోపాత్రకు చిత్రలహరి బ్యూటీ నివేత పేతురాజ్ ఎంపికైంది. వైవిధ్యమైన జోనర్‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించే అవకాశాలు కనిపిస్తున్నాయి.