పెళ్లి పాటేసుకున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాదీవాలా దేశీ గానా -అంటూ భారత్ చిత్రంలోని ఓ తమాషా పెళ్లి పాట వీడియోను విడుదల చేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. పాటకు కత్రినా కైపు, సల్మాన్ టైపు కొత్త సొగసు తీసుకొచ్చింది. చీర కట్టు, రింగుల జుత్తులో కన్ను చెదిరే అందంతో మేడ మెట్లమీద నుంచి దిగుతూ కత్రినా తన బ్యూటీతో అందర్నీ ఫిదా చేసేసింది. దానికితోడు చీరలో ఆమె వేసిన స్టెప్పులు పాటకు మరింత ఊపు తీసుకొచ్చాయి. అభిమానులను కట్టిపడేసిన ఈ పాట -్భరత్ చిత్రానికి హైలెట్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లూ మొదలయ్యాయి. భారత్‌లో మరో హీరోయిన్‌గా దిశాపటానీ కనిపించనుంది. కత్రిన -సల్మాన్ కాంబోకు చాలా గ్యాప్ రావడంతో, సినిమా విడుదలయ్యే రంజాన్ (జూన్ 5) కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన 70ఏళ్ల కాలంలో దేశంతోపాటు ఎదిగి పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన వ్యక్తి కథను సినిమా ఇతివృత్తంగా ఎంచుకున్నారు. సల్మాన్ తన పాత్రను దర్శకుడు వైవిధ్యంగా చూపించనున్నాడన్న టాక్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది.