డబుల్ దిమాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ‘డబుల్ దిమాక్ హైదరాబాదీ’ ట్యాగ్‌లైన్. రీసెంట్‌గా టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న సినిమా, ప్రస్తుతం గోవాలో పాట చిత్రీకరణ జరుపుకుంటోంది. నభానటేష్‌తో కలిసి రామ్ ఇక్కడ ఓ పాటేసుకుంటున్నాడు. ఈ సినిమాలో నభాతోపాటు రామ్‌కు జోడీగా నిధి అగర్వాల్ కనిపించనుంది. రామ్ బర్త్‌డే స్పెషల్‌గా టీజర్‌ను నేడు విడుదల చేయనున్నారు. పూరి కట్‌చేయించిన టీజర్ చూస్తే దిమ్మ తిరిగిందంటూ ఇప్పటికే చూసినవాళ్లు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంపై ఆనందం వ్యక్తం చేయడం తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మణిశర్మ సంగీతం సమకూరుస్తుంటే, పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మికౌర్ నిర్మిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు.