కెజిఎఫ్-2లో డబుల్ డోస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా కెజిఎఫ్ చాప్టర్-1తో ఎలాంటి సంచలనాలు సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత వసూళ్లు సాధించాడు. ప్రశాంత్ నీల్ చిత్రానికి దర్శకత్వం వహిస్తే, హూంబలే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని తెరకెక్కించింది. కన్నడం, హిందీ, తెలుగు, తమిళంలో చక్కని వసూళ్లతో ఆకట్టుకుంది. ప్రస్తుతం దానికి సీక్వెల్ కెజిఎఫ్ చాప్టర్ 2 ఆన్ సెట్స్ ఉంది. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. తాజాగా షెడ్యూల్స్ వివరాల్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం బెంగుళూరులో షూటింగ్ చేస్తున్నామని, తర్వాత మైసూర్, ఆర్‌ఎఫ్‌సిలో ఉంటుందన్నారు. చివరగా కర్నాటక -బళ్లారి షెడ్యూల్‌తో 90 శాతం చిత్రీకరణ పూర్తవుతుందని కెజిఎఫ్ టీమ్ అధికారికంగా ప్రకటించింది. చాప్టర్-2లో పలువురు బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తొలి భాగాన్నిమించి భారీ యాక్షన్‌ని చూపించనున్నట్టు దర్శకుడు ప్రశాంత్ నీల్, యశ్ ఇదివరకే వెల్లడించారు. మాఫియాని పీక్స్‌లో చూపించబోతున్నారని హూంబలే సంస్థ తెలిపింది.