పెళ్లి విలువ చెప్పే జీలకర్ర బెల్లం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తీకేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజిరెడ్డి సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం జీలకర్ర బెల్లం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమా పాటల సీడీని దర్శకుడు దశరథ్ విడుదల చేసి మొదటి కాపీని దాస్య నాయక్‌కు అందించారు. ఈ సందర్భంగా విజయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అందమైన కథాంశంతో రూపొందించామని, దర్శకుడిగా తనకిది తొలి సినిమా అయినా, అందరూ సపోర్టు చేయడంతో తనకు నచ్చిన విధంగా రూపొందించానని అన్నారు. తెలుగమ్మాయి రేష్మకు గుర్తింపు వస్తుందని అన్నారు. ప్రస్తుతం యువతకు చదువు ఉద్యోగం సంపాదన అన్నీ వున్నాయని, తల్లిదండ్రులు కూడా ప్రశ్నించలేని విధంగా ఏడడుగులు వేసి పెళ్లి చేసుకొని ఎనిమిదో అడుగు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదన్న సందేశం జోడించి ఈ సినిమాను రూపొందించామని, ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. లవ్ వర్సెస్ ఇగో అన్న పాయింట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో కొత్తగా పెళ్లిచేసుకున్న జంట మధ్య ప్రేమ గెలుస్తుందా ఇగో గెలుస్తుందా అన్న కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించారని, ప్రేమ అనేది గినె్నడు పాలు అయితే ఇగో చిన్న చుక్క లాంటి విషయమని, ఆ పాలల్లో ఇది కలవకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రేమికుల మధ్య వుందని ఈ సినిమా చెబుతుందని, మ్యూజికల్‌గా కొత్తగా వుంటుందని హీరో హీరోయిన్లు తెలిపారు. కార్యక్రమంలో గుణ్ణం గంగరాజు, వెనిగళ్ల రాంబాబు, రామసత్యనారాయణ, ప్రతాని రామకృష్ణగౌడ్, బలరాం లక్ష్మణ్, వందేమాతరం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రఘుబాబు, తా.రమేష్, సూర్య, ఉత్తేజ్ తదితరులు నటించిన చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు:కొమ్మనాపల్లి గణపతిరావు, ఎడిటింగ్:నందమూరి హరి, టెమెరా:చిట్టిబాబు, పాటలు:రామ్‌కిరణ్, కరుణాకర్, వెనిగళ్ల రాంబాబు, నిర్మాతలు:ఎ.శోభారాణి, ఆళ్ల నౌరోజిరెడ్డి, దర్శకత్వం:విజయ్ శ్రీనివాస్.