దేవరకొండ.. బ్రేకప్..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న సినిమాకు బ్రేక్ అప్ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. అదీ విషయం. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ మరోవైపు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు బ్రేక్‌అప్ అనే టైటిల్ పెట్టాలని దర్శకుడు క్రాంతిమాధవ్ ప్లాన్ చేస్తున్నాడట. విజయ్ సరసన రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ టైటిల్ టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ బ్రేక్ అప్ చెబుతున్నాడన్న న్యూస్ హల్చల్ చేస్తుంది. ఇక మన రౌడీ హీరో ఇప్పటికే నటించిన డియర్ కామ్రేడ్ సినిమాను జూన్‌లో విడుదల చేస్తున్నారు. దాంతోపాటు తాజాగా హీరో అంటూ మరో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. దాంతోపాటు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రేక్ అప్ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని త్వరలోనే విడుదల చేస్తారట.