క్రికెట్ ఆడనున్న కౌసల్య కృష్ణమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రప్రసాద్, ఐశ్వర్యా రాజేష్, కార్తీక్ రాజు, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కిస్తున్న చిత్రం కౌసల్య కృష్ణమూర్తి. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కెఎస్ రామారావు సమర్పణలో కెఎ వల్లభ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్‌లో చిత్రం మోషన్ పోస్టర్‌ను దర్శకుడు భీమనేని శ్రీనివాస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కెఎస్ రామారావు మాట్లాడుతూ టైటిల్‌రోల్ ఐశ్వర్యా రాజేష్ పోషించారు. టైటిల్‌కు తగ్గట్టే అమ్మాయి టైలర్‌మేడ్ పెర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. రాజేంద్రప్రసాద్ ఆమెకి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టుగా దర్శకుడు భీమనేని సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఆడియో, ప్రీరిలీజ్ జరుపుకుని జూలై మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుత పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది. కథ కోసం వెతుకుతున్న సమయంలో తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘కణ’ సినిమాని తెలుగులో చేద్దామనుకుంటున్న టైంలో కెఎస్ రామారావు ఈ సినిమా రైట్స్ సాధించి తెలుగులో చేద్దామన్నారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి క్రికెటర్ అవ్వాలనుకునే ఒక మహిళ తన ప్రయాణంలో ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేసి ఇంటర్నేషనల్ క్రికెటర్ స్థాయికి ఎదిగింది అనేది కథాంశం. తండ్రీ కూతుళ్ళమధ్య జరిగే ఎమోషన్స్ ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటాయన్నారు. హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ మాట్లాడుతూ ఈ చిత్రం నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా. తమిళ, మలయాళం, హిందీ సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా అని చెప్పడానికి సంతోషిస్తున్నా అన్నారు. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.