..ప్యార్ దే వెంకీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ‘వెంకీమామ’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. మేనమామ వెంకీతో కలిసి నాగచైతన్య స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాకు బాబీ దర్శకుడు. మూవీ షెడ్యూలు ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతున్నట్టు సమాచారం. వెంకటేష్ తదుపరి ప్రాజెక్టు సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఉంటుందన్నది విన్న విషయమే. అజయ్ దేవ్‌గణ్, టబు, రకుల్‌ప్రీత్ కాంబినేషన్‌లో వచ్చిన ‘దే దే ప్యార్ దే’ హిందీ మూవీకి తెలుగు రీమేక్‌ను వెంకీ చేయనున్నాడు. నిర్మాత సురేష్‌బాబు ఈ విషయాన్ని ఇంతకుముందే ధ్రువీకరించారు. అయితే, తాజా సమాచారం ప్రకారం బాలకృష్ణ హీరోగా 2016లో ‘డిక్టేటర్’ మూవీకి దర్శకత్వం వహించిన శ్రీవాసుకి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ఉన్నారట.
శ్రీవాసు దర్శకత్వం వహించిన చివరి సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ‘సాక్ష్యం’. అది ఆశించినంత విజయం సాధించలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కనుక శ్రీవాస్‌కు దక్కితే, దర్శకుడి అదృష్టం తలుపుతట్టినట్టే. అయితే, దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘దే దే ప్యార్ దే’ హిందీలో మంచి వసూళ్లను రాబడితే, తెలుగులో వెంకీ తనదైన స్టయిల్‌తో సినిమాకు రక్తికట్టించి మంచి వసూళ్లే రాబట్టగలడన్న చర్చ సాగుతోంది.