మే 20న రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాల్, శ్రీదివ్య జంటగా ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై జి.హరి రాయుడు పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సందర్భంగా హీరో విశాల్ మాట్లాడుతూ.. నా కెరీర్‌లోనే ఓ డిఫరెంట్ సినిమా ఇది. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుంది అన్నారు. నిర్మాత హరి మాట్లాడుతూ.. రాయుడు విశాల్ కెరీర్‌లోనే క్రేజీ సినిమా అవుతుంది. మే మొదటి వారంలో షూటింగ్ పూర్తిచేసి, అదే వారంలో ఆడియోను విడుదల చేస్తాం. ప్రస్తుతం షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 20న ప్రపంచ వ్యాప్తంగా భారీగా చిత్రాన్ని విడుదల చేస్తాం అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేల్‌రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, సమర్పణ: విశాల్, నిర్మాత: జి.హరి, దర్శకత్వం: ముత్తయ్య.