క్రిష్ కొత్త ఆలోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు క్రిష్ టెన్షన్‌లో ఉన్నాడు. తెలుగులో మహానటుడు ఎన్టీఆర్ జీవిత కథతో రెండు భాగాల బయోపిక్‌ని తెరకెక్కించి పరాజయం అందుకున్నాడు. ఎన్టీఆర్ సినిమాను సరిగ్గా డీల్ చేయలేకపోయాడన్న వ్యాఖ్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. బాలయ్య టైటిల్ రోల్ పోషించిన సినిమా పరాజయం, దాంతోపాటు హిందీలో కంగనారనౌత్‌తో ‘మణికర్ణిక’ వివాదం.. టెన్షన్లలో కూరుకున్న క్రిష్, తరువాతి ప్రాజెక్టు ఏం ప్రకటిస్తాడా? అన్న అంతా ఎదురు చూశారు. అయితే అంచనాలకు భిన్నంగా క్రిష్ -వెబ్ సిరీస్‌ని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే సిరీస్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సిద్ధం చేశాడట. త్వరలోనే మొదలుపెట్టాలని చూస్తున్నట్టు సమాచారం. సొంత బ్యానర్‌పై సిరీస్ నిర్మాణం చేపట్టి తన సత్తాను మరోసారి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాడని అంటున్నారు.