బాహుబలి-2కు వేసవి సెలవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి సెలవులు స్కూళ్లు, కాలేజీలకు ఇవ్వడం మనం ఇప్పటివరకూ చూశాం. కానీ ఓ సినిమాకు కూడా వేసవి సెలవులు ఇవ్వడం ఇప్పుడు విశేషంగా మారింది. ‘బాహుబలి’తో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజవౌళి ఇప్పుడు బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా ‘బాహుబలి-2’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ది కంక్లూషన్ పెరుతో తెరకెక్కే ఈ సినిమా అత్యున్నత సాంకేతిక విలువలతోపాటు భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటికే జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సమ్మర్ కష్టాలు మొదలయ్యాయట. ఎండలు తీవ్రమవడంతో నెలరోజులపాటు షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వాలని యూనిట్ ప్లాన్ చేసుకుందట. ప్రస్తుతం ఫిలిమ్ సిటీలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ షెడ్యూల్ ముగియగానే వేసవి సెలవులు ఇస్తారట. ఆ తర్వాత మళ్లీ కంటిన్యూగా షూటింగ్ జరపనున్నారట. మొత్తానికి ఈ సినిమా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.