నిర్మాతగా.. సీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు తేజ -మరోసారి మహిళా ప్రాధాన్యతా చిత్రంతో వస్తున్నాడట. మరోసారి -కాజల్‌నే సరికొత్త పాత్ర కోసం ఎంపిక చేసుకున్నాడట. ఇద్దరి కాంబినేషన్‌లో -నాలుగోసారి సినిమా రాబోతోందట. ఇందులో ఏంటి స్పెషల్ అన్న ప్రశ్నకు మాత్రం -సమ్‌థింగ్ సమాధానం ఒకటి రెడీగా ఉందంటున్నారు. అదేంటంటే -్ఫ్యచర్ ప్రాజెక్టుతో కాజల్ ప్రొడ్యూసర్ కాబోతోంది. ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో కాజల్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది దర్శకుడు తేజే. అది మొదలు కాజల్ -హీరోయిన్‌గా సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది. కాజల్ కెరీర్ ఒకింత వెనుకబడినపుడూ -నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో అవకాశమిచ్చాడు తేజ. ఆటుపోట్లకు ఎదురీది, కెరీర్‌పరంగా కాస్త వెనుకబడిన ప్రతిసారీ రెట్టించిన ఉత్సాహంతో పరిగెత్తి -టాప్ హీరోయిన్లలో ఒకరిగా క్రేజ్ ఎంజాయ్ చేస్తోంది కాజల్. అలాంటి బ్యూటీ -అదే దర్శకుడు తేజ ప్రాజెక్టుతో నిర్మాతగానూ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోందన్నది స్పెషల్ న్యూస్. ఇటీవలే తేజ-కాజల్ కాంబినేషన్‌లో ‘సీత’ వచ్చింది. అయితే -ఊహించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సీత విజయాన్ని అందుకోలేదు. అయినా -కాజల్ కోసమే మహిళా ప్రాధాన్యమున్న మరో సబ్జెక్టును తేజ సిద్ధం చేస్తున్నట్టు టాలీవుడ్‌లో వినిపిస్తోన్న మాట. మోడ్రన్ సొసైటీలోని యూత్ ఆటిట్యూడ్ ప్రధానాంశంగా కథ ఉండొచ్చన్న మాట వినిపిస్తోంది. దర్శకుడు తేజ హస్తవాసితో -ప్రొడ్యూసర్‌గానూ కాజల్ సక్సెస్‌ఫుల్ కెరీర్ కొనసాగిస్తుందేమో చూద్దాం.