కౌశల్య.. మైల్‌స్టోన్ మూవీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస రావు తెరకెక్కించిన చిత్రం -కౌసల్యా కృష్ణమూర్తి. క్రీడానేపథ్యంలో తెరకెక్కిన కథను కెఎస్ రామారావు సమర్పణలో కెఏ వల్లభ నిర్మించారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌తోనే ఆసక్తి రేకెత్తించిన చిత్రం టీజర్‌ను చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘క్రికెట్ నేపథ్యంగా వస్తోన్న వైవిధ్యమైన కథాంశమిది. ప్రతి ఒక్కరూ కనెక్టవుతారు. సాధారణ రైతు బిడ్డగా పుట్టిన ఓ యువతి అంతర్జాతీయ క్రికెట్ స్థాయికి ఎలా ఎదిగిందన్న కథను స్ఫూర్తివంతంగా చూపించడం బావుంది. లీడ్‌రోల్ కోసం నాలుగైదు నెలలు శిక్షణ తీసుకున్న ఐశర్య రాజేష్ క్రికెట్ క్యారెక్టర్‌కు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇదొక మైల్‌స్టోన్ మూవీగా నిలుస్తుందని మనస్ఫూర్తిగా భావిస్తున్నా అన్నారు. టీజర్‌ను చిరంజీవి విడుదల చేయడంపై దర్శకుడు భీమినేని శ్రీనివాస రావు, కెఎస్ రామారావు కృతజ్ఞతలు తెలిపారు.