వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ‘జనతాగ్యారెజ్’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్ తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీతో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమా ఎట్టకేలకు సెట్ అయింది. ఇప్పటికే ఆయనతో కథ రెడీ చేసుకోమని చెప్పాడట ఎన్టీఆర్. ప్రస్తుతానికి స్క్రిప్ట్‌పై కుస్తీలు పడుతున్నాడట వక్కంతం వంశీ. రచయితగా ఉన్న వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారనున్నాడు. సెప్టెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నాడు. పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారెజ్’ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నారు.