బాలయ్యను ఒప్పిస్తాడా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పైసా వసూల్’ చేయలేనంత మాత్రాన.. పూరీ డైరెక్షన్‌లో పస తగ్గిందని అనగలమా? ఏమో ఈ ప్రశ్నకు సమాధానం ‘ఇస్మార్ట్ శంకర్’ చెప్పాలి. అయినా పూరీకి ప్లాపులు, బాలయ్యకు హిట్లూ ఎప్పుడూ వెంటుండేవేం కాదు. ప్రయత్నంపై బలం చూపించడమే తప్ప, ఫలితంపై ఆశలు పెట్టుకునే రకాలుకాదు వీళ్లిద్దరూ. అందుకే -మళ్లీ కాంబో సెట్ కావొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. కొత్త కథలో కొత్త అవతారంతో బాలయ్యను -పూరి ప్రజెంట్ చేసిన తీరు ఆడియన్స్‌కి నచ్చలేదు. పైసా వసూల్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతమాత్రాన పూరి ఆగిపోలేదు. తనదైన స్టైల్లో మరోసారి బాలయ్యను ప్రజెంట్ చేసే ఆలోచనకు పదును పెడుతూనే ఉన్నాడట. ‘పైసా వసూల్’ ప్రాజెక్టుతో ఇద్దరి మధ్యా కొంత ఎడం పెరిగినా -మనసులో మాటతో బాలయ్యకు టచ్‌లోనే ఉన్నాడన్నది తాజా సమాచారం. ఈసారి పర్ఫెక్ట్ స్టోరీతో బాలయ్యను సరికొత్తగా ప్రజెంట్ చేయడానికి పూరి సిద్ధమవుతున్నాడని టాక్. ప్రస్తుతం ‘ఇస్మార్ట్ శంకర్’తో బిజీగా ఉన్నాడు పూరి. ఆ సినిమాను థియేటర్లకు తెచ్చిన తరువాత బాలయ్యకు కథ చెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కెఎస్ రవికుమార్ తెరకెక్కిస్తోన్న ప్రాజెక్టుతో బిజీగావున్నాడు బాలయ్య. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేలోగా బాలకృష్ణకు కథ చెప్పి ఒప్పించాలన్న తలంపుతో పూరీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణకూ హిట్టు మార్క్ స్టోరీ అవసరం. సో, పూరి కనుక ఆ విషయంలో సక్సెస్ అయితే దర్శకుడు బోయపాటి, బాలకృష్ణ చేయాల్సిన సీక్వెల్ స్టోరీలు వెనక్కి జరగక తప్పవేమో.