డబ్బింగ్‌కు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ తొందరపడుతున్నాడు. ఆడియన్స్ ముందుకొచ్చి చాలాకాలం అవుతుండటంతో -తరువాతి ప్రాజెక్టు ఏమాత్రం ఆలస్యం కాకుండా జాగ్రత్తపడుతున్నాడు. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఒకవైపున షూటింగ్ కొనసాగుతుంటే, మరోవైపు డబ్బింగ్ మొదలెట్టేశారు. బన్నీ డబ్బింగ్‌కు రెడీ అయిన ఫొటోలను చిత్రబృందం విడుదల చేసింది. ఇంతవరకూ బన్నీపై షూట్ చేసిన పార్ట్‌కు డబ్బింగ్ పూర్తి చేయనున్నారట. దువ్వాడ జగన్నాథం తరువాత ఈ ప్రాజెక్టు కోసం బన్నీతో మరోసారి పూజా హెగ్డే జోడీకట్టింది. సెకెండ్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ చేస్తుంటే, నవదీప్, సుశాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బన్నీ- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రెండు హిట్లు పడటంతో -హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో చిత్రబృందం ఉంది. సంక్రాంతిని టార్గెట్ చేస్తూ హారిక అండ్ హాసిని, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి.