కమల్-రజనీ మరోసారి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్.. సూపర్‌స్టార్ రజనికాంత్ కలిసి నటించే సినిమా త్వరలోనే పట్టాలు ఎక్కబోతుంది? ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. స్వశక్తితో సినిమా రంగంలో రాణించిన ఇద్దరు వ్యక్తులు సూపర్‌స్టార్ ఇమేజ్ అందుకుని... ప్రస్తుతం ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసేందుకు రాజకీయ పార్టీలను స్థాపించిన విషయం తెలిసిందే. దాదాపు ఒకే తరహాలో ఈ ఇద్దరు హీరోల ప్రయాణం సాగింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి నటించే సినిమా అంటే నిజంగా అది పెద్ద సంచలనమే అవుతుంది. 70వ దశకంలో హీరోగా కెరీర్ మొదలుపెట్టిన కమల్, రజని ఇద్దరు కలిసి పలు చిత్రాల్లో నటించారు. అయితే కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఉరువవుగల్ మారాలం అనే సినిమాలో చివరిసారి కలిసి నటించారు. 1983లో విడుదలైన సినిమా ఇది. ఆ తరువాత అంటే దాదాపు ముప్పై ఏళ్ల తరువాత ఇద్దరు కలిసి నటించే సినిమాకు సన్నాహాలు చేస్తున్నది ఎవరో కాదు కమల్ కుమార్తె అక్షర హాసన్? కమల్ పెద్ద కూతురు శృతిహాసన్ హీరోయిన్‌గా సౌత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ హీరోయిన్‌గా మారింది. అయితే చిన్న కూతురు అక్షర మాత్రం హీరోయిన్‌గా నిలదొక్కుకోలేదు. దాంతో ఈమెకు దర్శకత్వం వహించాలన్న ఆలోచన కలిగిందట. అందుకే ఈ ఇద్దరు స్టార్స్‌ని పెట్టి సినిమా ప్లాన్ చేస్తుంది. అక్షరహాసన్ ఇదివరకే దర్శకత్వ శాఖలో అసిస్టెంట్‌గా చేసింది. ఎలాగూ అనుభవం కూడా ఉంది కాబట్టి ఈ క్రేజీ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.