వీడో వెరైటీ సుందరాంగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణసాయి, వౌర్యాని హీరో హీరోయిన్లుగా ఎమ్ వినయ్‌బాబు దర్శకత్వంలో బీసు చందర్‌గౌడ్ నిర్మిస్తోన్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ -సుందరాంగుడు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా ఆన్ లొకేషన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. దర్శకుడు ఎమ్ వినయ్‌బాబు మాట్లాడుతూ -జమీందార్ కుటుంబంలో పుట్టిన హీరో అందంగా లేకున్నా డబ్బుచూసి అమ్మాయిలు అతని వెంటపడతారు. హీరో సాధారణ యువకుడిగా మారి బయటకి వచ్చినపుడు అసహ్యించుకుంటారు. అలాంటి అమ్మాయిల్ని ఎలా వశపర్చుకున్నాడు? చివరకు తననెంతో ఇష్టపడే మరదలి ప్రేమను ఒప్పుకున్నాడా? అన్నది సినిమా ఇతివృత్తం. ప్రతి సన్నివేశం ఆసక్తికరంగా, ఆహ్లాదంగా తీర్చిదిద్దాం. త్వరలో దుబాయ్‌లో చేయబోయే పాటతో షూటింగ్ పూర్తవుతుంది అన్నారు. నిర్మాత బీసు చందర్‌గౌడ్ మాట్లాడుతూ -దర్శకుడు వినయ్‌బాబు చాలాకాలంగా తెలుసు. తను చెప్పిన కథ నచ్చడంతో సినిమా నిర్మాణం మొదలెట్టాం. హీరో కృష్ణసాయి గతంలో తమిళం, తెలుగులో పలు సినిమాలు చేసారు. అలాగే హీరోయిన్ వౌర్యాని చాలా తెలుగు సినిమాల్లో నటించారు. ఇందులో హీరో హీరోయిన్ల పాత్రలు బాగా డిజైన్ చేశారు దర్శకుడు. సినిమా అనుకున్న దానికన్నా బాగావస్తోంది. నిర్మాతలుగా మాకిది తొలి సినిమా కావడంతో దర్శకుడు వినయ్‌బాబు అన్నీ దగ్గరుండి చూస్తున్నారు. నిర్మాతలుగా ఈ సినిమా మాకు మంచి గుర్తింపు ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాం’ అన్నారు. హీరో కృష్ణసాయి మాట్లాడుతూ -దర్శకుడు వినయ్ వినూత్నమైన కానె్సప్ట్‌తో సినిమా చేస్తున్నారు. నా పాత్ర బాగా తీర్చిదిద్దారని చెప్పారు.