ఇస్మార్ట్‌గా ఆలోచించా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్దికాలంగా పరాజయాల్ని చవిచూస్తున్న దర్శకుడు పూరి. కొత్త ఆలోచనలతో సక్సెస్‌ను వెతుకునే ప్రయత్నంలో చేసిన చిత్రం -ఇస్మార్ట్ శంకర్. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సినిమాలో రామ్, నిథి అగర్వాల్, నభానటేష్ హీరో హీరోయిన్లు. 18న సినిమా థియేటర్లకు వస్తోంది.
ఈ సందర్భంలో మీడియాకు పూరి వాయస్.

టెంపర్ తరువాత హిట్టు పడలేదు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచన నుంచి పుట్టిందే -ఇస్మార్ట్ శంకర్. తెలంగాణ కుర్రాడిగా రామ్‌ను చూపిస్తున్నా.
శంకర్ అనే హైపర్ టెంపర్ కుర్రాడి కథ. అన్ని రకాల కమర్షియల్ యాంగిల్స్ ఉంటాయి. ఒక హైదరాబాద్ లోకల్ రౌడీ కథ చెప్పాలని చేసిన ప్రయత్నమిది. అయితే, ఎప్పటినుంచో తెలంగాణ స్లాంగ్‌లో సినిమా చేయాలన్న ఆలోచన ఉంది. అందుకే కథ పూర్తయ్యాక స్లాంగ్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది.
కథ లీకైందంటూ ప్రచారం జరగడం నిజమే. కాని ఆ కథకూ ఈ కథకూ సంబంధం లేదు. స్క్రిప్ట్ మా దగ్గరుందంటూ డబ్బులు డిమాండ్ చేశారు కొందరు. మేం సీరియస్‌గా తీసుకోలేదు.
రామ్‌లో ఎంత ఎనర్జీవుందో సినిమాలో అర్థమవుతుంది. డ్రెస్, హెయిల్ స్టైల్ విషయంలో కేర్ తీసుకున్నాడు. క్రెడిట్ రామ్‌దే. హీరోయిన్లు ఇద్దరూ బాగా చేశారు. నభ నటేష్ తెలంగాణ అమ్మాయిలా హీరోతో పోటీపడే పాత్రలో కనిపిస్తుంది.
సినిమా చూసుకున్నాం. నిర్మాతగానూ హ్యాపీగా ఉన్నాను. హీరో రామ్ పెద్ద హగ్ ఇచ్చాడు. అందుకే ఏ టెన్షన్ లేదు. దీనికి సీక్వెల్ చేయాలని ఫిక్సయ్యా. టైటిల్ రిజిస్టర్ చేయించాను. సినిమా విడుదల తరువాత అన్నీ చెబుతా.
ఆకాష్‌తో నేను నిర్మాతగా ఓ సినిమా చేస్తాను. దాంతోపాటు మరో స్క్రిప్ట్ చేస్తున్నాను. బాలకృష్ణతోనూ సినిమా చేయాలని ఉంది. బాలయ్య కోసం స్పెషల్ కథ కుదిరితే వెంటనే వెళ్లి కలుస్తా.