లీడర్.. లుక్కిచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేచురల్ స్టార్ నాని వెర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్ ‘గ్యాంగ్ లీడర్’. తాజాగా ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. పోస్టర్‌లో అయిదుగురు భిన్నవయస్కులైన ఆడవారితో కలిసి బైనాక్యూలర్స్ పట్టుకుని ఉన్న నానితో ఆకట్టుకునేలా డిజైన్ చేసిన పోస్టర్‌తో గ్యాంగ్‌లో ఉన్నదెవరో రెవీల్ చేశారు. కథానుగుణంగా ఉన్న ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌మీద అంచనాలని మరింతగా పెంచింది. ఫస్ట్ సాంగ్‌ని జూలై 18న, టీజర్‌ని జూలై 24న రిలీజ్ చేయనున్నారు. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో డిఫరెంట్ లుక్‌లో ఉండే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘నాని’స్ గ్యాంగ్ లీడర్’ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 30న విడుదలకానుంది. మ్యూజిక్ సెనే్సషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్‌ఎక్స్100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెనె్నల కిశోర్, జైజా, సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.