హారర్.. వైకుంఠపాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయికేతన్, మేరి హీరో హీరోయిన్లుగా అజ్గర్ అలీ దర్శకత్వంలో నిర్మిత కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తోన్న చిత్రం -వైకుంఠపాళి. హైదరాబాద్‌లో ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన కెఎస్ రామారావు ఆడియోను లాంచ్ చేశారు. ‘ఆదినారాయణ సినిమాల పట్ల ఫ్యాషన్ ఉన్న వ్యక్తి. ఆయన ఆలోచనలే విభిన్నంగా ఉంటాయి. అలాంటి వ్యక్తి ‘వైకుంఠపాళి’ టైటిల్‌తో సినిమా నిర్మించటం హ్యాపీగా ఉంది. టైటిల్, ట్రైలర్ అంతా కొత్తగా ఉంది. కొత్త కానె్సప్ట్‌ల్ని ఆదరిస్తున్న తరుణంలో వస్తున్న ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది అన్నారు. దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ -టైటిల్ క్యాచీగా ఉంది. ఇంతవరకూ తెరపై రాని హారర్ గేమ్ ఇది. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు వి సముద్ర మాట్లాడుతూ -వైకుంఠపాళి ఆట అందరిగా బాగా తెలిసిందే. అలాంటి గేమ్‌తో ఒక హారర్ సినిమా చేయాలనుకునే ఆలోచనే అద్భుతం. కానె్సప్ట్ ఓరియంటెడ్ చిత్రానికి తప్పక విజయం సిద్ధిస్తుంది అన్నారు. చిత్ర దర్శకుడు అజగర్ అలీ మాట్లాడుతూ -షూటింగ్ నుంచి విడుదల వరకూ సినిమా వచ్చిందంటే ప్రధాన కారణం నిర్మాత ఆదినారాయణ. కొత్తవారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి మంచి సినిమాను తీయించారు. వైకుంఠపాళి ఓ కొత్త పాయింట్. అందరికీ కనెక్టవుతుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ -హీరో సాయికేతన్ పాత్ర అండర్ కవర్ కాప్. నేను రాసుకున్న కథకు దర్శకుడు పూర్తి న్యాయం చేశాడు. మంచి కంటెంట్, మంచి టీం.. సినిమా అనుకున్నదానికంటే బాగా వచ్చింది. సినిమాకు బిజినెస్ పూరె్తైంది. 23న సినిమాను విడదల చేస్తున్నాం. ఆడియన్స్ కొత్తవారిని ప్రోత్సహించండి’ అన్నారు.