ఆ రెండు గంటలూ ప్రేమలోనే ఉంటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో, దర్శకుడిగా శ్రీపవార్ తెరకెక్కిస్తోన్న చిత్రం -2 అవర్స్ లవ్. కృతిగార్గ్ హీరోయిన్. సరికొత్త ప్రేమ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ట్రైలర్‌ను రాజ్ కందకూరి విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -టైటిల్ చూస్తుంటే రెండు గంటలపాటు ఆడియన్స్‌ని ప్రేమలో ఉంచే సినిమా అని అర్థమవుతుంది. హీరో, దర్శకత్వం రెండూ చేపట్టడం చిన్న విషయం కాదు. అందుకు సాహసించిన శ్రీపవార్‌ను అభినందించాలి. ట్రైలర్ చూస్తుంటే మంచి కంటెంట్‌తో సినిమా రూపుదిద్దుకుందని అర్థమవుతుంది. గ్యానిసింగ్ సంగీతం బావుంది. ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు. హీరోయిన్ కృతిగార్గ్ మాట్లాడుతూ -దక్షిణాది సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది. కథ మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. మంచి పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన హీరో, డైరెక్టర్‌కు కృతజ్ఞతలు అన్నారు. హీరో, దర్శకుడు శ్రీపవార్ మాట్లాడుతూ -చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఇష్టం. నన్ను దర్శకత్వం వైపు ప్రోత్సహించిన వ్యక్తి సుకుమార్. అందుకే ‘2 అవర్స్ లవ్’ చిత్రాన్ని ఆయనకు అంకితమిస్తున్నా. హీరో, దర్శకుడిగా నన్ను ప్రోత్సహించిన పేరెంట్స్, స్నేహితులు, తోబుట్టువలకు ధన్యవాదాలు. ఎంటైర్ టీం సపోర్ట్ చేసింది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు.