నివాసి.. ఓ లైఫ్ స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంకాని దేశం వదిలి -పల్లెల్లోని మూలాలు వెతుక్కునేందుకు
కదిలిన కుర్రాడి కథ -నివాసి.
పిల్లలకు డబ్బు విలువ తెలియజెప్పే కథలు చాలానే వచ్చాయి. కాని,
ఇది బతుకు విలువ తెలిపే కథ.
అందుకే నివాసి
-నాకో స్పెషల్.

శేఖర్‌వర్మ, వినియా, విద్య.. లీడ్‌రోల్స్‌లో దర్శకుడు సతీష్ రేగళ్ల తెరకెక్కించిన చిత్రం -నివాసి. కెఎన్ రావు, టివివిఎస్‌ఎన్ వర్మ నిర్మాతలు. 23న సినిమా విడుదలవుతోన్న సందర్భంలో మీడియాతో హీరో శేఖర్ వర్మ ముచ్చటించాడు.

కథకు ఆప్ట్ టైటిల్ -నివాసీ. ఓ ఎన్నారై కుర్రాడు భారత్‌లో తన మూలాలు వెతుక్కునే క్రమమే ఈ కథ. పాత్ర పేరు -వివాన్ ఆదిత్య. సంపూర్ణమైన జీవితం ఉన్నవాడని అర్థం. సినిమాలో ప్రతి పాత్రకూ మంచి మీనింగ్‌తో పేర్లు పెట్టాం.
పరాయి దేశంలో అతి గారాబంగా పెరిగిన కొడుక్కి -జీవితాన్ని పాఠంగా కాకుండా ప్రాక్టికల్‌గా చెప్పాలనుకుంటాడు తండ్రి. కొన్ని నిబంధనలు పెట్టి ఇండియాలో వదిలేస్తాడు. తరువాత ఏం జరిగిందన్నదే అసలు కథ. ఫాదర్ ఎమోషన్ స్టోరీ.
యువరాజును రాజ్యాభిషిక్తుడ్ని చేయడానికి ముందు దేశ పర్యటనకు పంపుతాడు మహారాజు. ఇలాంటి కథలు జానపదాల్లో చాలానే చదువుకున్నాం. ఆ కానె్సప్ట్‌కు నివాసి కథ దగ్గరగా ఉంటుంది.
సమస్యలు ఎదురైనపుడు బతుకు విలువ తెలుస్తుంది. హీరో స్ట్రగుల్డ్ జర్నీ ఎమోషనల్‌గా సాగుతుంది. అలా హీరో -పరిపూర్ణత్వాన్ని సాధించడాన్ని ఆడియన్స్ కనెక్టింగ్ పాయింట్‌లో చెప్పాం.
తమిళ జయప్రకాష్ తండ్రి పాత్ర పోషించారు. సుదర్శన్ సినిమా అంతా ఉంటాడు. ప్రేమ, స్నేహం, సామాజిక సేవ.. ఇవన్నీ సినిమాను ఎలివేట్ చేస్తాయి. నాకు పెయిర్‌గా వినియా -ఓ మెచ్యూర్డ్ క్యారెక్టర్ చేసింది. డైరెక్టర్ సతీష్ వేగెళ్ల నా స్నేహితుడే. కథను డీల్ చేసిన విధానం అద్భుతం.
ఇండస్ట్రీలో నాకంటూ బ్యాగ్రౌండ్ లేదు. కాకినాడలోని గొల్లపాలెం నుంచి ఇండస్ట్రీకి వచ్చాను. శ్రీకృష్ణుడింట శ్రీరాముడంట సినిమాతో పరిచయమై, బాలకృష్ణ ‘జయసింహ’లో మంచి పాత్ర చేశాను. తరువాతి ప్రాజెక్టులుగా -అంగుళిక, యుగన్ చేస్తున్నా. మంచి పేరు తెస్తాయన్న నమ్మకముంది. హీరోగానే కాదు, నెగిటివ్ షేడ్ పాత్రలూ చేయడానికి సిద్ధంగావున్నా.