బీచ్ బ్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ ప్రాజెక్టుల హెవీ షెడ్యూల్స్‌తో అలసిపోయిన రకుల్‌ప్రీత్ -ప్రస్తుతం బీచ్‌లో సేదతీరుతోంది. బాలీవుడ్‌లో దే దే ప్యార్ దే, టాలీవుడ్‌లో మన్మథుడు 2లో సీనియర్ హీరోలతో సందడి చేయడమే కాదు, సొగసు సోకుతో కుర్రకారు మతి పోగొట్టిన ఫిట్‌నెస్ బ్యూటీ -తన ఇన్‌స్టాలో అంతకుమించి ఫొటోలు షేర్ చేస్తూ అల్లరి చేస్తోంది. ఫొటోల్లో రకుల్ బ్యూటీకి కుర్రకారు ఫిదా అవుతున్నారు. విశ్రాంతి కోసం స్పెయిన్‌లోని ఐబిజా ఐలాండ్‌లో విహారయాత్రకు దిగిన రకుల్ -బీచ్ బావుందా? బ్యూటీ బావుందా? అన్నట్టుగా స్విమ్‌సూట్ స్టిల్స్‌ని షేర్ చేయడం వైరల్ అవుతోంది. ఆమె అందాలకు ఫిదా అయిన అభిమానులు సోషల్ నెట్‌వర్క్‌లో కామెంట్లమీద కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే రకుల్ భారతీయుడు -2 ప్రాజెక్టులో జాయినవ్వాలి. కమల్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న సీక్వెల్‌లోనూ రకుల్ సీనియర్ హీరో సరసనే పాత్ర చేయబోతోంది. కాజల్ మరో కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ ఆ సీక్వెల్‌ను నిర్మిస్తోంది. రకుల్ ఫొటోలు చూసిన కొందరు మాత్రం -కుర్ర హీరోల పక్కన చాన్స్‌ల కోసమే అంటున్నారు. విశ్రాంతి సమయంలోనూ కెరీర్ దృక్కోణంతోనేవున్న రకుల్‌ను మెచ్చుకుని తీరాలని అంటున్నారు.