డాన్స్‌తో మెప్పించే సుప్రీమ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘సుప్రీమ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మే మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, సాయిధరమ్‌తేజ్ ఈ సంస్థలో చేస్తున్న మూడో చిత్రం ఇదని, ‘సుప్రీమ్’ అందరినీ అలరించే మాస్ ఎంటర్‌టైనర్‌గా ఈ వేసవిలో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఆనందాన్నిచ్చేలా వస్తోందని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, సాయి కార్తీక్ పాటలు ఆదరణ పొందాయని అన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో మాస్ మసాలాగా యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ డాన్స్, నటన ఆకట్టుకుంటాయని, అతని కెరీర్‌లో ఓ మైలురాయిలా ఈ చిత్రం నిలుస్తుందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో భారీ అంచనాల దృష్ట్యా గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. రాజేంద్రప్రసాద్, వెనె్నల కిశోర్, రవికిషన్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, శ్రీనివాస్‌రెడ్డి, మురళీమోన్, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, వెనె్నల కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:సాయి శ్రీరామ్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, సంగీతం:సాయి కార్తీక్, ఆర్ట్:ఎ. ఎస్. ప్రకాష్, సమర్పణ:రాజు, నిర్మాత: శిరీష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనీల్ రావిపూడి.