ఈశాన్యభారతంలో గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు సాయిరోనక్, అతిథిసింగ్, ఐశ్వర్య ప్రధాన తారాగణంగా ఐ వింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘గుప్పెడంత ప్రేమ’ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వినోద్ మాట్లాడుతూ, తొలి ప్రేమ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే కథాకథనాలతో ఫీల్‌గుడ్ మూవీగా ఈ సినిమాను రూపొందించామని, గుప్పెడంత ప్రేమ వుంటే చెప్పలేనంత ఆనందం ఉంటుందన్న పాయింట్ చర్చించిన ఈ చిత్రం యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని, యువత మనసులో వున్న స్వచ్ఛమైన భావనలకు అద్దంలా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. అందమైన ప్రాంతాలు షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయతోపాటుగా ఈశాన్య భారతదేశంలోని పలు ప్రాంతాలలో షూటింగ్ చేశామని, యువతకు కనెక్ట్ అయ్యేలా రాసుకున్న కథాకథనాలు, మాటలు అందరికీ నచ్చుతాయని, సంగీతం హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల కానుందని వారు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంజయ్ లోక్‌నాథ్, ఆర్ట్: రాజీవ్‌నాయర్, సంగీతం: నవనీత్ సుందర్, పాటలు: వనమాలి, శ్రీమణి, ఎడిటింగ్: బసవ, రచన, దర్శకత్వం: వినోద్ లింగాల.అతిథిసింగ్