ప్రీ రిలీజ్‌కు బందోబస్తు రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాత్మక కథలు, వైవిథ్యమైన పాత్రలతో ఆడియన్స్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు సూర్య. గజని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ సూర్యకు స్టార్ ఇమేజ్ వచ్చింది. సూర్యనుంచి వస్తోన్న తాజా చిత్రం -బందోబస్తు. కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న సినిమాను దర్శకుడు కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో అందిస్తున్నారు. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకురానున్న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ సెప్టెంబర్ రెండోవారంలో గ్రాండ్‌గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ‘ఎన్నో తారల సంగమం.. అంబరం ఒకటే’.. ‘చెరుకు ముక్కలాంటి’ పాటలు, కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచుతున్నాయి. తెలుగు టీజర్, ట్రైలర్‌లో -పాక్ తీరును ఎండగడుతూ మోహన్‌లాల్ చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్స్, సూర్య నటన సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. సూర్య సరసన సాయేషా సెహగల్ నటిస్తుంటే, కీలక పాత్రలో ఆర్య, ముఖ్యపాత్రలను బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ నాగినీడు తదతరులు పోషిస్తున్నారు.