రవి - వర్మ.. ఓకే ఓకే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవితేజ తాజా ప్రాజెక్టు -డిస్కోరాజా. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా చిత్రీకరణ పూరె్తైంది. పోస్ట్ ప్రొడక్షన్స్ సైతం చివరి దశకు చేరడంతో -డిస్కోరాజా ఆడియన్స్‌ని పలకరించేందుకు రెడీ అయిపోయాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయివుంది. గతంలో వీళ్లిద్దరు చేసిన ‘డాన్ శీను’ తరహా యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ సైతం కొలిక్కి రావడంతో -డిస్కోరాజా థియేటర్లకు వచ్చిన వెంటనే కొత్త ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లొచ్చని అంటున్నారు. డాన్ శీనుతో రవితేజకు ఓ బెంచ్‌మార్క్ క్రియేట్ చేసిన గోపీచంద్ మలినేని -హీరో మేనరిజమ్స్‌ని ఎలివేట్ చేసే యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌నే సిద్ధం చేశాడని అంటున్నారు. విశేషమేంటంటే -తదుపరి ప్రాజెక్టునూ రవితేజ లైన్‌లోకి తెచ్చినట్టు తెలుస్తోంది. ఈమధ్యే శర్వానంద్‌తో ‘రణరంగం’ సినిమా చేసిన సుధీర్‌వర్మ -రవితేజతో తదుపరి ప్రాజెక్టు చేయనున్నట్టు సమాచారం. అసలు ‘రణరంగం’ రవితేజ కోసమే సిద్ధం చేసినా -శర్వా ఆసక్తి చూపటంతో అతనితో ప్రాజెక్టు చేసేశారు. ఆ టైంలోనే రవితేజకు సుధీర్ వర్మ చెప్పిన మరో పాయింట్ నచ్చటంతో -స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. కథాచర్చలు ముగించి స్క్రిప్ట్‌ను లాక్ చేయడంతో -సమాంతరంగా ఈ ప్రాజెక్టునూ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదని అంటున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రావొచ్చు. సో, వచ్చే ఏడాది రవితేజ నుంచి రెండు సినిమాలు ఆడియన్స్‌ని సంతృప్తిపరుస్తాయన్న మాట.