శత్రువూ వ్యసనమే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మందు, సిగరెట్, అమ్మాయిలూ... శత్రువు కూడా వ్యసనమే. ఆ వ్యసనానికి నేనూ బానిసనే -అంటున్నాడు హీరో శ్రీవిష్ణు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, కృష్ణవిజయ్ ఎల్ ప్రొడక్షన్స్, శ్రీ ఓం సినిమా బ్యానర్లపై కృష్ణవిజయ్ ఎల్ తెరకెక్కిస్తోన్న చిత్రం -తిప్పరా మీసం. తాజాగా సినిమా నుంచి టీజర్ విడుదలైంది. ఆద్యంతం ఉత్కంఠ కలిగించేలా టీజర్‌ను కట్ చేశారు. దర్శకుడు కృష్ణవిజయ్ శ్రీవిష్ణుని ఆవిష్కరించిన తీరు, లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రంలో శ్రీవిష్ణుతో నిక్కీ తంబోలి జోడీ కట్టింది. అసలు హీరో శత్రువెవరు? ఎంత పగతో మీసం తిప్పాల్సి వచ్చింది? ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది స్క్రీన్‌పైనే చూడాలి. చిత్రానికి సురేశ్ బొబ్బిలి సంగీతం, సిద్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు.