కాళోజి బయోపిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైనీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాకర్ జైనీ డైరెక్షన్‌లో కాళోజి నారాయణరావు బయోపిక్ నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. దర్శకుడు ప్రభాకర్ జైనీ ఆ వివరాలను ప్రకటనలో అందిస్తూ -2019 సెప్టెంబర్ 9 కాళోజీ 105వ జయంతి. 1992లో భారత ప్రభుత్వ నుంచి పద్మవిభూషణ్ అందుకున్న కాళోజీ జీవిత విశేషాలు, ఆయన రచనలు, స్వాతంత్య్ర పోరాట విశేషాలను ఈ తరానికి తెలియచేసే ఉద్దేశం, మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి హారతిపట్టిన వారి జీవిత విశేషాలను దృశ్యరూపంలో నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో ‘కాళన్న’ పేరిట బయోపిక్‌ను ప్రారంభిస్తున్నాం. కాళోజీకి సంబంధించిన దస్తావేజులు, ఫొటోలు, గ్రంథాలు సేకరించి సూత్రప్రాయంగా ఓ స్టోరీ లైన్ అనుకున్నామని నిర్మాత విజయనిర్మల జైనీ వెల్లడించారు. కాళోజీకి అత్యంత సన్నిహితులను సంప్రదించి స్క్రీన్‌ప్లేకు తుదిరూపం ఇచ్చి త్వరలో షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు ప్రభాకర్ జైనీ పేర్కొన్నారు.