నాతో పందెమేస్తే సస్తరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గణేశ్‌గాడి దెబ్బకి మగ పురుగు కూడా నామీద వాలడం లేదు’ అని హీరోయిన్ మృణాళిని రవి చెబుతోందంటే -ఆ గణేష్‌గాడి క్యారెక్టర్ ఎలావుంటుందో ఊహించడం కష్టం కాదు. ఆ గణేశ్ ఎవరో కాదు, వరుణ్ తేజ్. గని అలియాస్ గద్దలకొండ గణేశ్ పాత్రతో వస్తోన్న వరుణ్‌తేజ్ తాజా చిత్రం -వాల్మీకి. తమిళంలో హిట్టయిన జిగార్తాండను దర్శకుడు హరీశ్ శంకర్ తెలుగులో తెరకెక్కించాడు. కెరియర్ ఆరంభం నుంచీ వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలతోనే వస్తున్న వరుణ్‌తేజ్ -సరికొత్త ఊరమాస్ పాత్రతో చేస్తున్న సినిమా వాల్మీకి. వరుణ్ లుక్కే ఆసక్తి రేకెత్తిస్తే టీజర్‌తో మరింత ఆసక్తి పెంచేశారు. ఇప్పుడు ట్రైలర్‌లో వరుణ్ చెప్పిన డైలాగులు సినిమా రేంజ్‌ని పెంచుతున్నాయి. ‘నాపైన పందెంవేస్తే గెలుస్తారు. నాతోటి పందాలేస్తే సస్తరు’ అంటూ వరుణ్ చెప్పే డైలాగ్ -ఆ క్యారెక్టర్ స్టామినాను చూపించింది. ‘మనం బతుకుతున్నామని పదిమందికీ తెలీకపోతే, ఇక బతుకుడెందుకురా’ అంటూ వరుణ్ ఓ డిఫరెంట్ మాండలికాన్ని ప్రజెంట్ చేయడం వైవిధ్యంగా ఉంది. తన పాత్ర ఆడియన్స్‌కి బలంగా కనెక్టవుతుందన్న నమ్మకం తనకుందంటూ తాజాగా వరుణ్‌తేజ్ ట్వీట్ చేయడం తెలిసిందే. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న వాల్మీకిలో తమిళ హీరో అధర్వ మురళి కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఒక కథానాయికగా పూజాహెగ్దె, మరో హీరోయిన్‌గా ముణాళిని రవి నటించారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తోన్న చిత్రం సెప్టెంబర్ 20న థియేటర్లకు వస్తోంది.