పిడికిలి బిగించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రమోషనల్ పోస్టర్‌తోనే ఓ పట్టుపట్టాడు -హీరో సాయిధరమ్ తేజ్. యువీ క్రియేషన్స్, జీఎ 2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా -ప్రతిరోజూ పండగ. చిత్రలహరి తరువాత సాయితేజ్ చేస్తోన్న తాజా ప్రాజెక్టు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో సాయితో రాశిఖన్నా జోడీకట్టింది. తొలి ప్రచార చిత్రాన్ని హీరో సాయితేజ్ మంగళవారం ట్వీట్టర్ వేదికగా విడుదల చేశాడు. రెండు చేతులు పిడికిలి బిగించి పట్టిన పట్టును పోస్టర్‌పై చూపిస్తూ -ఇది వేలు విడవని బంధం అంటూ క్యాప్షన్ తగిలించారు. ప్రమోషనల్ పోస్టర్‌తో సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ సాయి ట్వీట్ చేయడం ఆసక్తిగా ఉంది. బుధవారం ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కుటుంబ కథాంశంతో చిత్రం తెరకెక్కుతున్నట్టు ప్రమోషనల్ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది.