పరశుకి ప్రాజెక్టుపడింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరశురామ్‌కు కొత్త ప్రాజెక్టు పడింది. గీత గోవిందం హిట్టుతో విమర్శకుల నుంచి ప్రశంసలందుకున్న పరిశురామ్ -తరువాతి ప్రాజెక్టును వేగంగా పట్టాలు ఎక్కించలేకపోయాడు. తదుపరి ప్రాజెక్టు ప్రయత్నాల్లో భాగంగా నాగార్జునకు లైన్ చెప్పడం -అది నాగ్‌కు బాగా నచ్చటం జరిగిందట. అఖిల్‌ను దృష్టిలో పెట్టుకుని చెప్పిన కథ కనెక్టివ్‌గా ఉండటంతో -కొడుకు కోసం కొత్త ప్రాజెక్టును నాగార్జునే ట్రాక్‌పైకి తేవడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సరైన ప్రాజెక్టులు సెట్ కాకపోతుండటంతో -అఖిల్ సినిమాల మధ్య అంతకంతకూ గ్యాప్ పెరుగుతోంది. అది వర్థమాన హీరో కెరీర్‌కు ఎంతమాత్రం మంచిది కాదన్న ఉద్దేశంతోనే -నాగార్జున కొత్త ప్రాజెక్టుపై ఫోకస్ పెడుతున్నాడని అంటున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అఖిల్‌కు ప్రాజెక్టును సెట్ చేశాడు నాగ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఆ సినిమా తెరకెక్కుతోంది. అయితే పరశురామ్‌తో చేపట్టబోయే ప్రాజెక్టును మాత్రం అన్నపూర్ణపైనే నిర్మించనున్నాడట. కొద్ది రోజుల్లోనే మిగతా వివరాలు తెలియొచ్చు.