మీ నవ్వు కోసం గ్యాంగ్ ఎదురుచూస్తూ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థియేటర్లలో ఆడియన్స్ నవ్వుల కోసం గ్యాంగ్ ఎదరు చూస్తోందంటున్నాడు హీరో నాని. దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన నానీస్ గ్యాంగ్‌లీడర్ సెప్టెంబర్ 13న థియేటర్లకు రాబోతోంది. ప్రమోషన్స్‌లో బిజీగావున్న నాని టీం తెలుగు రాష్ట్రాల టూర్ ముగించుకుని -బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్, మోహన్ (సివీఎం) నిర్మించిన ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. మ్యూజిక్ సెనే్సషన్ అనిరుథ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చాడు. నానికి జోడీగా ప్రియాంక, ఓ ప్రధాన పాత్రలో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటించారు. ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్‌తో ఇప్పటికే సినిమాపై ఆసక్తి నెలకొంది. సెన్సార్‌లో యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది.
నాని మాట్లాడుతూ -ఈరోజుతో ప్రమోషన్ ముగిసుంది. రెండురోజుల్లో సినిమా రాబోతుంది. మిగతాది సినిమానే చూసుకుంటుంది. రిలీజ్‌కి ముందు తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, వైజాగ్ అన్నిచోట్లా.. టీమ్‌కి మీడియా, ఆడియన్స్ నుంచి వామ్ వెల్కమ్ లభించింది. అందుకు అందరికీ థాంక్స్. హైదరాబాద్ మీడియాని కలవకుంటే సర్కిల్ పూర్తి కానట్టే. అందుకే, ప్రెస్‌మీట్ పెట్టాం. మంచి అవుట్‌పుట్‌తో అంతా హ్యాపీగావున్నాం. ఎప్పుడెప్పుడు థియేటర్స్‌లో మీ నవ్వులు చూద్దామా అని ఎగ్జైటెడ్‌గా ఉన్నాం. మైత్రి టీం పెర్ఫెక్ట్ ప్లాన్‌తో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా ముగిసింది. విక్రమ్ కెరీర్‌లో ఇది ఫాస్టెస్ట్ ఫిల్మ్. షూటింగ్‌ని అంతా ఎంజాయ్ చేశాం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ విషయంలో విక్రమ్ లక్కీ డైరెక్టర్. సరైన టీమ్ కుదిరింది. కార్తికేయ బిజీగా ఉండి కూడా కథ విని ఎగ్జయిట్ అయి ఒప్పుకున్నాడు. స్క్రీన్‌పై కొత్త కార్తికేయను చూస్తారు. పోలెండ్ నుంచి సినిమాటోగ్రాఫర్ వస్తున్నారంటే భయపడ్డాం. అతనివల్లే సినిమా బ్రాండ్ న్యూగా ఉంది. అనిరుథ్ మాకు బ్యాక్‌బోన్. ప్రతి సాంగ్ సెనే్సషన్ అవుతుంది. నాకు రిలీజ్ ముందు రెండురోజులంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ టెన్షన్‌లో ఒక కిక్ ఉంటుంది. ఈ రెండురోజులు నేను ఎంజాయ్ చేస్తాను. సెప్టెంబర్ 13నుండి మీరు ఎంజాయ్ చేయండి’ అన్నాడు.
నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ -సెప్టెంబర్ 13న ‘గ్యాంగ్‌లీడర్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్టవుతుందన్న నమ్మకముంది. ఫ్యామిలీ, యూత్ అంతా చూడదగ్గ చిత్రమిది. నానితో ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమా నుంచే ఓ సినిమా చేద్దామనుకున్నాం. మూడేళ్ల తరువాత ‘గ్యాంగ్‌లీడర్’తో ఆ కోరిక నెరవేరింది. తరువాతి ప్రాజెక్టును తొందరగా చేయాలనుకుంటున్నాం. మైత్రీ బ్యానర్‌కు బ్రహ్మాండమైన సినిమా తీసిన విక్రమ్‌కు కృతజ్ఞతలు. హీరోయిన్ ప్రియాంక, కార్తీకేయ సహా ఆర్టిస్టులు, సాంకేతిక వర్గానికి ధన్యవాదాలు అన్నారు. వర్సటైల్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ మాట్లాడుతూ -ముందుగా సినిమాకు ఒప్పుకున్న నానికి థాంక్స్. నాని సపోర్ట్ ఎప్పటికీ మరువను. ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించిన మైత్రి సంస్థ నిర్మాతలతో సినిమా చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. కార్తికేయ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ప్రియాంక మంచి పెర్ఫార్మర్. అనిరుథ్ అద్భుతమైన బాణీలనే కాదు, మంచి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమాటోగ్రాఫర్ మిరోస్లాకు బాబ్రోజెక్ పోలెండ్ వాసి. వండర్‌ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎడిటర్ నవీన్ సినిమాకోసం చాలా కష్టపడ్డాడు. ఇంతమంది కష్టాన్ని సెప్టెంబర్ 13న నవ్వుల్లో మునిగి ఎంజాయ్ చేయండి అన్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ సిఇఓ చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ -్ఫబ్రవరి 19న సినిమా మొదలైంది. ఆరు నెలల్లో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు రావడం గొప్ప విషయం. అందుకు దర్శకుడు విక్రమ్ కారణం. బ్రిలియంట్ ప్లానింగ్‌తో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేశారు. సినిమాలో సీజీ వర్క్ చాలావుంది. దానికి సంబంధించిన షూటింగ్ ఫస్ట్‌లోనే కంప్లీట్ చేసి, బెస్ట్ అవుట్‌పుట్ రావడానికి కంపెనీకి కావాల్సిన టైమ్ ఇచ్చారు. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అంతా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో సినిమా చూడండన్నారు. హీరోయిన్ ప్రియాంక మాట్లాడుతూ -మేకింగ్ మొత్తం ఫన్నీగా సాగిపోయింది. తప్పకుండా సినిమా చూడండన్నారు. నటుడు కార్తికేయ మాట్లాడుతూ -కథ వినగానే ఎగ్జైటెడ్‌గా అనిపించింది. దర్శకుడు విక్రమ్, హీరో నాని ఉన్నారనే ఈ పాత్రకు అంగీకరించా. కానీ ఇప్పుడు అర్థమవుతోంది, ఎవరివల్లనైనా ప్రభావితమై పాత్ర చేయకుండా ఉంటే ఎంత మిస్సై ఉండేవాడినో. ఈ మూవీ మరో పది పదిహేనేళ్ల వరకూ కొత్త ట్రెండ్, జోనర్‌ని క్రియేట్.. చాలా సినిమాలకు రిఫరెన్స్ అవ్వడం ఖాయం. నానికి ఈ ఏడాది ‘జెర్సీ’లాంటి మూవీ ఉంది. దానే్న వేరే భాషల్లోనూ చేస్తున్నారు. ఇప్పుడు ‘గ్యాంగ్‌లీడర్’ వస్తుంది. ప్రియాంక పెర్ఫార్మెన్స్ బావుంది. టీమ్‌కి ఆల్‌ది బెస్ట్ అన్నారు.