నల్లమలను తవ్వేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలపై హీరో విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశాడు. చెరువుల నాశనం చేసుకున్నాం. తాగునీటి వనరులు కలుషితం చేసుకున్నాం. పర్యావరణానికి జరుగుతోన్న హాని ప్రభావాన్ని ఇప్పటికే అనుభవిస్తున్నాం. ఇప్పుడు యురేనియం కోసం నల్లమలను కూడా తవ్వేసుకుందామా? అంటూ ప్రశ్నించాడు. యురేనిజయం తవ్వకాలపై ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ -ప్రకృతిని ఇప్పటికే నాశనం చేశాం. వినాశనాన్ని ఇలాగే కొనసాగిద్దామా? అంటూ ప్రశ్నించాడు. మన ప్రాంతానికి ప్రాణవాయువునిస్తున్న నల్లమల నాశనమయ్యే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ కోసం యురేనియం కొనుక్కోవచ్చు. నాశనమయ్యే అడవుల్ని ఎక్కడ కొంటామంటూ ప్రశ్నించాడు. యురేనియం కోసం నల్లమల అడవుల తవ్వకాలపై ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు గొంతువిప్పారు. అడవులను కాపాడుకుందామంటూ పిలుపునిస్తున్నారు.