మాస్ సినిమాలంటే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్, రకుల్‌ప్రీత్‌సింగ్, కేథరిన్ ప్రధాన పాత్రల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం ‘సరైనోడు’. బోయపాటి శ్రీను దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ, సినిమాకు టెక్నీషియన్స్ ప్రాణంపోశారని, రకుల్, కేథరిన్‌లు మంచి కథానాయికరలని, కేథరిన్ అనుకున్నట్లుగానే సినిమా పెద్ద హిట్ అయిందని అన్నారు. ఈ సినిమా చేసేప్పుడు తనకొక గోల్ ఉండేదని, ఆ గోల్‌ను సాధించానని, మాస్ సినిమాలంటే చాలా ఇష్టమని, బోయపాటివల్లే ఈ సినిమా చేశానని, ఈ రోల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందంటే ఆయనే కారణమని అన్నారు. అల్లు అరవింద్ తన తండ్రైనా, మొదటగా ఆయనొక ప్యాషనేట్ ప్రొడ్యూసరని, సినిమాను ఎంతో ప్రేమిస్తారని, నేను తమ్ముడు, నాన్న కలిసి వాట్స్ యాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నామని, దాని పేరు ‘వి లవ్ సినిమా’. చిరంజీవిగారి కెరీర్‌లో హైయ్యస్ట్ గ్రాస్ కలెక్షన్స్ చేసిన సినిమా నాన్న నిర్మించినదేనని, అలానే పవన్‌కళ్యాణ్ చేసిన ‘జల్సా’ సినిమా ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌అని, అలానే చరణ్‌తో చేసిన ‘మగధీర’ బాక్సాఫీస్ రికార్డ్స్‌ను తిరగరాసిందని, ఇలా ఎందరో హీరోల కెరీర్‌లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారని అన్నారు. తనకొక పిచ్చి ఉందని, తాను చేసిన సినిమా ప్లాప్ అయినా పర్లేదుకానీ.. చూడడానికి మాత్రం బావుండాలని ఉంటుందని, గీతాఆర్ట్స్ బ్యానర్‌లో హిట్ కొట్టాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, ‘బద్రినాథ్’తో హిట్ కొట్టాలని ప్రయత్నించానుకానీ కుదరలేదని, ఇప్పుడు సరైన సినిమా పడిందని అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ, ‘బన్నీ పది సంవత్సరాల కెరీర్‌లో రకరకాల పాత్రలు చేశాడు. ఒకసారి నాదగ్గరకు వచ్చి మాస్ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే సినిమా చేయాలనుందని అడిగాడు. బోయపాటి మాత్రమే అలాంటి సినిమా చేయగలడని ఆయనను కలిశాను. బోయపాటి ఆరునెలలు వర్క్‌చేసి స్క్రిప్ట్ రెడీ చేశాడు. యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా కథ రాయడం కష్టమైన పని. బోయపాటి బన్నీకు సూట్‌అయ్యే కథను రెడీచేసి సినిమా మొదలుపెట్టాడు. అతడి మీద నమ్మకంతోనే సినిమాకోసం బాగా ఖర్చుపెట్టాను. తను ఎప్పుడూ సినిమాల గురించే ఆలోచిస్తుంటాడు. ఎంతో ప్యాషన్‌తో వర్క్ చేస్తాడు. ఆదివారంనాటికి థియేటర్ల సంఖ్యను పెంచాం’ అని తెలిపారు.