సత్తా చూపిన మార్షల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అభయ్, మేఘా చౌదరి హీరో హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం -మార్షల్. ఎవీఎల్ ప్రొడక్షన్స్‌పై అభయ్ అడక నిర్మాతగా దర్శకుడు జై రాజ్‌సింగ్ తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన చిత్రానికి మంచి టాక్ రావడంతో -హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్రబృందం. కార్యక్రమంలో దర్శకుడు జై రాజ్‌సింగ్ మాట్లాడుతూ -శ్రీకాంత్ క్యారెక్టర్‌లోని వైవిధ్యం, హీరో అభయ్ హై ఓల్టేజ్ యాక్షన్‌కు ఆడియన్స్ బాగా కనెక్టయ్యారు. సినిమాని ఇంతగా ఆడియన్స్ ఆదరించటం హ్యాపీగా ఉంది అన్నారు. హీరోయిన్ మేఘా చౌదరి మాట్లాడుతూ -నా పాత్రకు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమా బావుందంటూ అభినందనలు వస్తుంటే హ్యాపీగా ఉంది. చూడని వాళ్లు తప్పకుండా థియేటర్లలో సినిమా చూడండి అన్నారు. హీరో అభయ్ మాట్లాడుతూ -మొదటిరోజు డల్‌గా ఓపెనింగ్స్ ఉండటంతో కంగారుపడ్డాం. అయితే ఆడియన్స్ వౌత్‌టాక్‌తో సినిమాను సెకెండ్ డే నుంచే ఆదరించారు. సినిమాకు పాజిటివ్ టాక్ ఇచ్చిన క్రిటిక్స్‌కి కృతజ్ఞతలు. సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం పట్ల హీరోగాను, నిర్మాతగానూ హ్యాపీగా ఉన్నా. కొత్తవాళ్లను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ -సినిమా సక్సెస్ సాధించటం హ్యాపీగా ఉంది. ఇటీవలి కాలంలో నేను చేసిన సినిమాల్లో ఇదో మంచి సినిమా. క్రిటిక్స్ నుంచీ అప్లాజ్ వస్తుంది. ఇదంతా దర్శకుడి క్రెడిబిలిటీ. జయరాజ్ కచ్చితంగా పెద్ద దర్శకుడు అవుతాడు. హీరో అభయ్, హీరోయిన్ మేఘా చౌదరికి మంచి భవిష్యత్ ఉంది అన్నారు.