మేజర్ విక్రమ్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ చిత్రాలతో యంగ్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సందీప్ కిషన్ -తాజాగా బాలీవుడ్‌లో భారీ వెబ్‌సిరీస్‌లో కనిపించనున్నాడు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన కుర్రాడు.. తన ఉద్యోగం ఏమిటన్నది కుటుంబానికి తెలియనివ్వకుండా గోప్యత పాటిస్తూ -ఎన్‌ఐఏలో గూఢచారి పాత్ర పోషించి టెర్రరిస్టుల నుంచి దేశాన్ని ఎలా కాపాడాడు? అన్న ఇతవృత్తంతో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’. బాలీవుడ్ ఎంట్రీకి చాలాకాలంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సందీప్ -ఈ వెబ్ సిరీస్‌తో ‘మేజర్ విక్రమ్’గా అక్కడ అడుగు పెడుతున్నట్టే. వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా మేజర్ విక్రమ్ పాత్రకు సంబంధించి సందీప్ లుక్ విడుదలైంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్‌కు రాజ్ నిడుమోరు, కృష్ణ డికె దర్శకులు. అమెజాన్ ఓరిజినల్స్‌లో సెప్టెంబర్ 20నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రారంభం కానుందట.