సితారతో నాగశౌర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథా చిత్రాలను నిర్మించే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. హీరో నాగశౌర్యతో కొత్త ప్రాజెక్టు ప్రకటించింది. కొత్తదనంతో కూడిన కథలను నిర్మించటంలో సితార బ్యానర్‌కు మంచి ఇమేజ్ ఉంది. ఆ బ్యానర్ నుంచి 8వ ప్రాజెక్టును హీరో నాగశౌర్యతో ప్లాన్ చేసింది. పీడీఏ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమాతో లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతోంది. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, త్వరలోనే వివరాలు ప్రకటిస్తామని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఓ ప్రకటన చేసింది. వచ్చే నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే మేలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు ప్రకటనలో పేర్కొంది.