టగ్ ఆఫ్ వార్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెప్టెంబర్ 20. అక్టోబర్ 2.
ఈ రెండు రోజుల్లో దమ్మున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయి. శుక్రవారం వరుణ్ తేజ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన -వాల్మీకి విడుదలవుతుంది. ఇది తమిళంలో హిట్టయిన జిగర్తాండకు రీమేక్. మరోపక్క తమిళ హీరో సూర్యతో దర్శకుడు కెవి ఆనంద్ తెరెకెక్కించిన బందోబస్తు (తమిళంలో కాప్పాన్) థియేటర్లకు వస్తోంది. ఇదీ తమిళ కథే. అనువాద చిత్రంగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. రెండు చిత్రాలపైనా -ఆడియన్స్‌లో ఆసక్తి కనిపిస్తోంది. దేశానికి రక్షణగా నిలిచే ఓ కమాండో జీవితమే బందోబస్తు చిత్రమంటూ ప్రమోషన్స్‌లో స్పష్టం చేశాడు హీరో సూర్య. దేశ భద్రతకు విఘాతం కలిగించే కుట్రను చేధించే ప్రత్యేక కమాండోగా తన పెర్ఫార్మెన్స్‌ను ట్రైలర్‌లో రుచి చూపించాడు కూడా. సూర్యతో సాయేషా సెహ్‌గల్ జోడీ కడితే, ముఖ్యపాత్రల్లో మోహన్‌లాల్, సముద్రఖని, ఆర్య పోషించారు. భారీ బడ్జెట్ చిత్రంగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన బందోబస్తు తెలుగు డబ్బింగ్ చిత్రంగా వస్తున్నా -సూర్యకు అలవాటుపడిన తెలుగు ఆడియన్స్ స్ట్రెయిట్ చిత్రంగా ఆదరించే అవకాశం లేకపోలేదు. ఇక అచ్చమైన తమిళ కథ తెలుగు రీమేక్‌గా వస్తోన్న చిత్రం -వాల్మీకి. ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్‌పై కమర్షియల్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన రీమేక్ ఇది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకుంటున్న వరుణ్‌తేజ్ -బ్యాడ్ బోయ్ క్యారెక్టర్ చేయడం విశేషం. గద్దలకొండ గణేశ్ అనే గ్యాంగ్‌స్టర్‌లో పరివర్తన విచ్చిన విధానమే -వాల్మీకి కథ. రెండోసారి పూజాహెగ్దె వరుణ్‌తో జోడీకట్టింది. తమిళ సీనియర్ హీరో మురళి కొడుకు అధర్వ మురళి ముఖ్యపాత్ర పోషించాడు. ఇంత ఊరమాస్ క్యారెక్టర్ చేయటం వరుణ్‌కు తొలిసారే అయినా, గద్దలకొండ గణేశ్ క్యారెక్టర్‌ను పూర్తిగా జీర్ణించుకుని పెర్ఫార్మెన్స్ ఇచ్చాడన్నది ట్రైలర్ చూస్తే అర్థమైంది. పైగా ‘ఎల్లువొచ్చి గోదారమ్మ’ అంటూ ఓ క్లాసిక్ సాంగ్‌ని రీమిక్స్ చేసి మరీ ఆడియన్స్‌ని ఊరిస్తున్నారు. సో, సినిమాపై అటు దర్శకుడు, ఇటు హీరో పూర్తి నమ్మకంతో ఉన్నారు. రెండు చిత్రాల కథకూ మూలం తమిళమే అయినా, తెలుగు ప్రేక్షకులు ఏ చిత్రాన్ని ఎక్కువ ఆదరిస్తారన్నది వెండితెరపై చూడాలి.
ఇదే తరహా పోటీ -అక్టోబర్ 2నా ఎదురుకానుంది. బాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కింది ‘వార్’. డిఫెన్స్‌లోని గురుశిష్యుల కథగా, దేశభక్తి నేపథ్యంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రమిది. దీని వేగానికి -సైరా విడుదల తేదీ వెనక్కి జరగొచ్చంటూ కథనాలు కమ్ముకున్నాయి. అయితే, సైరా మాత్రం వెనక్కి జరగలేదు. అనుకున్న సమయానికే విడుదల చేయడానికి కొణిదెల నిర్మాణ సంస్థ సిద్ధమైపోయింది. తాజాగా విడుదలైన సైరా ట్రైలర్ దుమ్ములేపటంతో -బాలీవుడ్‌తో ‘వార్’కు దిమ్మతిరిగే పోటీనిచ్చే దమ్మున్న సినిమాయేనంటూ సైరాపై కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం -సైరా. చిరంజీవి 151వ ప్రాజెక్టుగా వస్తున్న సైరా -తెలుగుతోపాటు తమిళం, కన్నడ, బాలీవుడ్‌లోనూ విడుదలవుతుంది. అయితే, బాలీవుడ్‌లో అదే రోజు టైగర్‌ష్రాప్, హృతిక్‌రోషన్ మల్టీస్టారర్ ‘వార్’ విడుదలవుతుండటంతో -సైరా ఒక మెట్టు కిందే ఉండొచ్చన్న కథనాలూ వచ్చాయి. రెండు పెద్ద చిత్రాలు థియేటర్ల వద్ద పోటీ పడాల్సి వస్తే -సైరాకే నష్టమంటూ భయాలు ముసిరాయి. బాలీవుడ్ జనాలు బాహుబలిలాంటి జానపద కథను ఆదరించినట్టే -సైరాలాంటి చారిత్రక చిత్రాన్నీ ఆదరించకపోరన్న నమ్మకంతో కొణిదెల ప్రొడక్షన్స్ సైరాను బాలీవుడ్‌లోనూ భారీగానే విడుదల చేస్తోంది. సల్మాన్ దబాంగ్ 3ని ప్రమోట్ చేసి రామ్‌చరణ్ -ఇప్పుడు సల్లూభాయ్ నుంచే సైరా ప్రమోషన్స్‌కీ మార్గం వేశాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించిన సైరాలో అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, నయనతార, తమన్నాలాంటి భారీ తారాగణం ఉండటంతో -బాలీవుడ్‌లోనూ దమ్ము చూపించగలదన్న నమ్మకాలు వచ్చేశాయి. అయితే, ఏ సినిమాకు ఎన్ని ప్లస్సులున్నా, ఆడియన్స్‌కి కనెక్ట్ కాకపోతే అన్నీ మైనస్‌లుగా పరిణిమించే పరిస్థితి ఉండకపోదు. సో, రెండు ముఖ్యమైన రోజుల్లో థియేటర్ల వద్ద పోటీ పడుతున్న నాలుగు చిత్రాల్లో -గెలుపెవరిదో ఆసక్తికరంగా మారింది.