ప్రభాసే.. రావణుడైతే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలితో సాధించుకున్న ఐదేళ్ల కష్టాన్ని ‘సాహో’తో నిలపలేకపోయాడు ప్రభాస్. బాహుబలితో శిఖరాగ్రానికి చేరిన తరువాత -కిందకు దిగే ఆలోచనను పక్కన పెట్టేసిన ప్రభాస్ ‘సాహో’ ప్రాజెక్టు చేశాడు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన సాహో -ఆడియన్స్‌కి అంతగా రీచ్ కాలేకపోయింది. అయితే సాహో ప్రమోషన్స్ టైంలోనే ప్రభాస్ -్భరీ బడ్జెట్ చిత్రాలతో అలసిపోయానని, ఈసారి అలాంటి కథలే వస్తే నిదానంగా ఆలోచిస్తానని ప్రకటించుకున్నాడు. కాని -ప్రభాస్ రూట్ మార్చుకునే అవకాశం లేదంటున్నారు ఇండస్ట్రీ జనాలు. తాజాగా ప్రభాస్ ఓ సినిమాకు సైన్ చేశాడని, ఆ కొత్త ప్రాజెక్టు సైతం పాన్ ఇండియా సినిమాగానే రావచ్చన్న కథనాలు వినిపిస్తున్నాయి. బాహుబలితో జానపదం, సాహోతో యాక్షన్ స్పై సినిమాలు చేసిన ప్రభాస్ -ఈసారి పౌరాణిక పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తోంది. రామయణాన్ని తెరకెక్కిస్తోన్న దర్శకుడు నితీశ్ తివారీ -్భరీ విగ్రహం కలిగిన ప్రభాస్‌తో రావణుడి పాత్ర వేయించాలన్న ఆలోచనతో ఉన్నట్టు టాక్. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రభాస్‌తో సంప్రదించినట్టూ కథనాలు వినిపిస్తున్నాయి. 500 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో త్రీడీ వర్షన్‌లో ప్రాజెక్టును రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా సినిమాకు కనుక ప్రభాస్ ఒకే అంటే -సినిమాకు అమాంతం ఇమేజ్ పెరగటం ఖాయం. అలాగే ప్రభాస్ సైతం తన రేంజ్‌నుంచి దిగకుండా మరో సినిమా చేసే అవకాశం దక్కుతుంది. ప్రభాస్ కెరీర్‌లో ఇంతవరకూ పౌరాణిక పాత్ర ఒక్కసారీ చేయలేదు. రావణుడి పాత్ర పోషించేందుకు ప్రభాస్ ఎంతవరకూ అంగీకరిస్తాడన్నదీ అనుమానమే. ఈ చిత్రంలో హృతిక్ రాముడు, దీపికా పదుకొనె సీత పాత్రలు పోషిస్తున్నారు.