అచ్చంగా.. ఆరు కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వయసొచ్చేకొద్దీ అనుభవం పెరుగుతుంది. అనుభవానికి తగిన రెమ్యునరేషన్ -పెంచుతోంది లేడీ సూపర్‌స్టార్. ప్రస్తుతం నయన్ డిమాండ్ -అచ్చంగా ఆరు కోట్లు. పైగా.. కండిషన్స్ అప్లై. టాప్ రేటెడ్ స్టార్‌గా దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని ఇమేజ్‌ను కొనసాగిస్తోందన్న నయన్ -ఇప్పుడున్న రేంజ్‌కి అంత సులువుగా ఏం చేరుకోలేదు. అఒరం, కోలమావు కోకిల, కోలైయుదిర్‌కాలం, ఐరా, డోరా.. లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాలతో స్పెషల్ స్టాటస్‌ను పెంచుకుంటూ వచ్చింది. అలాగే, ప్రాజెక్టులకు ఓకే చెప్ప విషయంలోనూ -రెమ్యునరేషన్ మెట్టు దిగకుండా నిలబడింది. ఇప్పుడు దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ అంటే -నయనే. ప్రస్తుతం రజనీకాంత్‌తో చేస్తున్న దర్బార్ ప్రాజెక్టుకీ నయన్ కాంప్రమైజ్ కాలేదట. అచ్చంగా ఆరు కోట్లు డిమాండ్ చేసిందన్న వార్తలే వినిపిస్తున్నాయి. చివరకి మిలింద్‌రావ్ డైరెక్షన్‌లో ప్రియుడు విఘ్నేశ్ శివన్ నిర్మిస్తోన్న ‘నెట్రికన్’ చిత్రానికీ తన డిమాండ్‌ను ఏమాత్రం తగ్గించలేదన్న టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. విఘ్నేశ్ శివన్ డైరెక్షన్‌లో గతంలో వినికిడి లోపమున్న మహిళగా ‘నానుం రౌడీదాన్’ సినిమా చేసిన నయన్ -ఇప్పుడు నెట్రికన్ చిత్రంలో చూపు సమస్యతో ఇబ్బందిపడే మహిళ పాత్ర పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో అక్టోబర్ 2న విడుదలవుతున్న సైరా, అటు తమిళంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో విజయ్ చేస్తున్న బిగిల్ చిత్రాలతో నయన్ బిజీగా ఉందట. ఈ రెండు ప్రాజెక్టులకూ భారీ పారితోషికానే్న తీసుకుంటున్న నయన్ -కండియన్స్ అప్లైలో చిన్న రిలాక్సేషన్ ఇచ్చిందని అంటున్నారు. చిరంజీవి 151వ ప్రాజెక్టుగా వస్తోన్న సైరా ట్రైలర్ 22న విడుదల కానుంది. ఎంత పెద్ద ప్రాజెక్టుకైనా ప్రమోషన్స్‌కు వచ్చేదిలేదంటూ భీష్మించే నయన్, సైరాకు మాత్రం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే, చెన్నైలో జరిగే బిగిల్ ఆడియో లాంచ్‌కీ నయన్ హాజరయ్యే అవకాశం లేకపోలేదన్న కథనం వినిపిస్తోంది. సో, పారితోషికం విషయంలో వెనక్కి చూడకపోయినా.. ఆమేరకు నిర్మాతలకు కొంత ఉపశమనం కలిగించనుందన్న మాట.