బికినీలకు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం దక్షిణాది టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న గ్లామర్ భామ కాజల్‌కు ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ అపజయం కాస్త నిరాశనే మిగిల్చింది. పవన్ సరసన హీరోయిన్‌గా నటిస్తుండడంతో మరిన్ని అవకాశాలు వస్తాయని ఎదురుచూసిన ఈమెకు నిరాశ మిగిలింది. తాజాగా బాలయ్య సరసన ఛాన్స్ వచ్చినా కూడా కాదని చెప్పిందట. తేజ దర్శకత్వంలో రానాతో చేసే సినిమాను ఒప్పుకోవడంవల్ల ఆ సినిమా చేయలేకపోతోందట. ఏదేమైనా తనదైన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న ఈమె బికినీ అందాలకు మాత్రం దూరమంటోంది. ఇప్పటికే హాట్ హాట్‌గా అందాలు ఆరబోసిన కాజల్‌కు సడెన్‌గా ఇలాంటి ఆలోచన రావడం ఆసక్తికరంగా నిలిచింది. ప్రస్తుతం ఈమె బికినీ గురించి ఎందుకు చెబుతోంది అని అందరిలోనూ ఆసక్తి మొదలైంది. దానికి కారణం ఇటీవలే ఓ సినిమాకోసం బికినీలో కనిపించాలని చెప్పారట. దానికి నో చెప్పిందట కాజల్. అదీ విషయం!